యూకే వెల్‌కమ్స్ మోదీ
- October 13, 2015
యూకేలోని భారతీయ సంఘాలు ప్రత్యేకంగా 'మోదీ ఎక్స్‌ప్రెస్' బస్సును ప్రారంభించాయి. వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ యూకేలో తొలి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఈ బస్సును ప్రారంభించినట్లు వారు చెప్పారు. ఈ బస్సు నెల రోజుల పాటు లండన్‌లోని ముఖ్య ప్రాంతాల్లో పర్యటించనుందని వారు చెప్పారు. ఈ బస్సును గత ఆదివారం ప్రారంభించగా లిటిల్ ఇండియాగా పేరొందిన వెంబ్లీలోని ఈలింగ్ రోడ్‌లో తొలిస్టాప్‌లో ఆగింది. దీపావళి నాటికి ట్రఫాల్గర్ స్క్వేర్ చేరుతుంది.ఈ సందర్భంగా 'యూకే వెల్‌కమ్స్ మోదీ' కార్యక్రమ నిర్వాహకురాలు మయూరి పర్మార్ మాట్లాడుతూ భారత్‌లో 'చాయ్ పే చర్చ' కార్యక్రమం నిర్వహించినట్లుగానే.. యూకేలో మోదీతో 'బస్ పే చర్చ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ రాకను పురస్కరించుకొని నవంబర్ 13వ తేదీన దాదాపు 400 సంస్థలు కలిసి.. వెంబ్లీ స్టేడియంలో ఓ పెద్ద కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు. ఈ కార్యక్రమానికి సుమారు 60వేల మంది హాజరుకానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







