బహ్రెయినీ టీచర్ హత్య: 10 మందికి జైలు
- June 20, 2017
ఫోర్త్ హై క్రిమినల్ కోర్ట్, పది మంది వ్యక్తులకు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఈస్ట్ ఎకెర్లో ఓ బహ్రెయినీ టీచర్ని హత్య చేసిన కేసులో నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఘటనలో టీచర్‌కి చెందిన ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరికి మరణ శిక్ష, మరో వ్యక్తికి జీవిత ఖైదు, మిగతావారికి మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అందులో ఇద్దరికి బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దు చేయాలనీ ఆదేశించింది న్యాయస్థానం. సెక్యూరిటీ ఫోర్సెస్‌ని టార్గెట్ చేస్తూ ఈస్ట్ ఎకెర్ దగ్గర్లోని షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటనలో 42 ఏళ్ళ టీచర్ ఫక్రియా ముస్లిం మృతిచెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందుంచారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







