సలాలా టూరిజం ఫెస్టివల్‌తో ఒమన్‌టెల్‌ అనుబంధం కొనసాగింపు

- June 20, 2017 , by Maagulf
సలాలా టూరిజం ఫెస్టివల్‌తో ఒమన్‌టెల్‌ అనుబంధం కొనసాగింపు

ఒమన్‌లో ప్రముఖ టెలికాం ప్రొవైడర్‌ అయిన ఒమన్‌టెల్‌, సలాలా టూరిజం ఫెస్టివల్‌తో తమ అనుబంధం కొనసాగుతుందని ప్రకటించింది. జూన్‌ 30 నుంచి ఆగస్ట్‌ 31 వరుకు జరగనున్న ఈ ఫెస్టివల్‌కి ఒమన్‌ టెల్‌ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. ఒమన్‌ క్యాలెండర్‌లో సలాలా ఫెస్టివల్‌ ప్రతి యేడాదీ ఓ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. వందలాది మంది వేలాది మంది సందర్శకుల్ని ఆకట్టుకోవడం సలాలా ఫెస్టివల్‌ ప్రత్యేకత. ఖరీఫ్‌ సీజన్‌లో దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలో ఈ టూరిజం ఫెస్టివల్‌ జరుగుతుంది. ఒమన్‌ టెల్‌ మేనేజర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ మొహమ్మద్‌ హస్సన్‌ లవాటి మాట్లాడుతూ, ఈ ఏడాదీ సలాలా ఫెస్టివల్‌లో భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. తమ విలువైన వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ఈ ఏడాది కూడా అందించబోతున్నామనీ, సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల్ని మెప్పించబోతున్నామని అన్నారు. అలాగే ఒమన్‌ టెల్‌, ఫెస్టివల్‌ కోసం వచ్చే సందర్శకులు, అలాగే సబ్‌స్క్రైబర్స్‌కి సమ్మర్‌ ఆఫర్స్‌ని ప్రవేశపెట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com