విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త!
- June 20, 2017
ఇండియా: విదేశాలకు వెళ్లే భారతీయులకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ శుభవార్తను అందించింది. వచ్చే నెల నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు డిపార్చర్ కార్డులు నింపాల్సినవసరం లేదని పేర్కొంది. అయితే ఇది కేవలం విమానాల్లో వెళ్లే వారికి మాత్రమేనని తెలిపింది. ఒకవేళ రైలు, నౌకల్లో విదేశాలకు వెళ్లే వారు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద ఎంబార్కేషన్ కార్డును నింపాల్సి ఉంటుందని చెప్పింది. 2017 జూలై 1 నుంచి అన్ని అంతర్జాతీయ విమానశ్రయాల్లో భారతీయులు డిపార్చర్ కార్డులను నింపే ప్రక్రియను రద్దు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ఆర్డర్ జారీచేసింది. ఈ నిర్ణయంతో భారతీయులు ఎలాంటి అవాంతరాలు లేకుండా విదేశాలకు ప్రయాణించవచ్చని పేర్కొంది.
ఇప్పటివరకు ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో వారు కచ్చితంగా తమ పేరును, జన్మించిన తేదీని, పాస్ పోర్ట్ నెంబర్, భారత్ లోని చిరునామా, విమాన నెంబర్, బోర్డింగ్ తేదీని డిపార్చర్ కార్డులో నింపాల్సి ఉంటుంది. ఇతర సంబంధిత ప్రాంతాల్లో కూడా ఇదే సమాచారం అందుబాటులో ఉంటుందని, ఈ మేరకు డిపార్చర్ కార్డు అవసరం ఉండదని హోం మంత్రిత్వ శాఖ తన ఆర్డర్ లో తెలిపింది. ఈ నిర్ణయంతో ప్యాసెంజర్ నింపుతున్న ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన వివరాల ప్రక్రియ సమయాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు సాయార్థం అధికారులు ఈ మేరకు నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిసింది. గతేడాది కూడా విదేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు డ్యూటియబుల్ గూడ్స్ ను తీసుకురాకపోతే డిక్లరేషన్ కార్డును నింపాల్సినవసరం లేదని కస్టమ్స్ డిపార్ట్ మెంట్ ఓ ఆర్డర్ జారీచేసింది.
తాజా వార్తలు
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..
- RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?







