మక్కాలో వేలాదిమంది యాత్రికుల కోసం ఉచిత స్వర్గ భోజనం
- June 20, 2017
మక్కాలోని గ్రాండ్ మసీద్ లో వేలాదిమంది ఉమ్రా యాత్రికుల కోసం రమదాన్ చివరి రోజులలో స్వర్గ భోజనాన్ని అందించనున్నట్లు మక్కా గవర్నర్,సలహాదారుడిగా ఉన్న సల్మాన్ ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ తెలిపారు. క్యుయాముల్ లేల్ మరియు ఫజ్ర్ ప్రార్ధనల మధ్య విరామంలో ఉమ్రా యాత్రికులు సుహూర్ భోజనం చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది. దీనికి పరిష్కారంగా గవర్నరు సూచన మేరకు వివిధ అనుమతి ఉన్న ఛారిటీ సొసైటీల సహకారంతో గవర్నరేట్ లో నీటి, నీటి పారుదల కమిటీ పర్యవేక్షణలో అమలు చేయబడుతోంది. గ్రాండ్ మసీద్ కు చెందిన ప్రాంగణాలు అలాగే బస్ స్టాండుల స్థలాలలో ఉచిత స్వర్గ భోజనం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు . కొలంబియా నుండి వచ్చిన యాత్రికుడు రిజ్మి రియల్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, యాత్రికుల సౌకర్యార్ధం ప్రిన్స్ ఖలేద్ ఏర్పాటుచేసిన అద్భుతమైన సేవ ఇది. ప్రస్తుతం ఇక్కడ జన సమూహం చాలా ఎక్కువగా ఉంది. సాహూర్ కోసం పలు చోట్లకు వెళ్ళి తిరిగి ఫజ్ర్ ప్రార్ధనలకు తగిన సమయానికి అందుకోలేపోతున్నామని ఆయన వివరించారు. మక్కాలో ఉంటున్న మరో మహిళా యాత్రికురాలు తన అనుభవాన్ని వివరిస్తూ, విదేశీ యాత్రికులు ఈ సేవ పట్ల ఎంతో అభినందిస్తున్నామని సుహూర్ భోజనం అందచేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉందని గతంలో మాదిరిగా కాక ఆహారాన్ని అన్వేషించకుండానే పవిత్ర మసీదు వద్ద ప్రార్థనలను కొనసాగించవచ్చని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. సర్వోన్నతుడైన అల్లాహ్ తన ఎనలేని దయతో సౌదీ ప్రభుత్వంను, దేశ పాలకులను దీవించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అలాగే, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి ఈ పవిత్ర మసీదుకు వచ్చిన ఇస్లామీయ ఉమ్మా యాత్రికుల పట్ల కరుణ చూపిన మహాత్మునికి సౌదీ ప్రజలను ఆశీర్వాదించాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్







