ఒక బాబాయి ఇద్దరు అబ్బాయిల సినిమా త్వరలో

- June 22, 2017 , by Maagulf
ఒక బాబాయి ఇద్దరు అబ్బాయిల సినిమా త్వరలో

  హిందీ చిత్రాల నిర్మాత బోనీ కపూర్‌, నటుడు అనిల్‌ కపూర్‌ అన్నదమ్ములు. బోనీ మొదటి భార్య కుమారుడు అర్జున్‌ కపూర్‌ హీరోగా పరిచయమై స్వల్ప కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాబాయ్‌, అబ్బాయ్‌ అయిన అనిల్‌, అర్జున్‌.. ఇద్దరూ కలిసి మొదటిసారిగా ఒక సినిమా చేస్తున్నారు. దాని పేరు 'ముబారకన్‌'. విశేషమేమంటే అర్జున్‌ ద్వి పాత్రలు పోషించడం. అంటే ఒక బాబాయికి ఇద్దరు అబ్బాయిలన్న మాట! కరణ్‌సింగ్‌, చరణ్‌సింగ్‌ అనే కవల సోదరులుగా అర్జున్‌ కనిపించనుండగా, వారి బాబాయ్‌ కర్తార్‌సింగ్‌గా అనిల్‌ కపూర్‌ నటించారు. కాకపోతే కరణ్‌, చరణ్‌ చిన్ననాటే విడిపోతారు. ఒకరు చండీగర్‌లో, మరొకరు లండన్‌లో పెరుగుతారు. ఆ ఇద్దరికీ జోడీగా ఇలియానా, అథియాశెట్టి (సునీల్‌శెట్టి కుమార్తె) నటించారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏమంటే అమ్మాయిలు తాము ప్రేమించిన వాళ్లతో కాకుండా మరొకర్ని పెళ్లాడే పరిస్థితులు ఏర్పడటం. అంటే కరణ్‌ను ప్రేమించిన అమ్మాయి చరణ్‌ను పెళ్లాడాల్సి వస్తే, చరణ్‌ చిన్ననాటి స్నేహితురాలు కరణ్‌ను పెళ్లాడాల్సి రావడం. ఈ విచిత్ర పరిస్థితిని కర్తార్‌సింగ్‌ ఎలా పరిష్కరించాడనేది ఆసక్తికరం.

అనీస్‌ బజ్నీ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com