హెచ్‌ఎంసి క్లీనిక్స్‌లో క్యాష్‌లెస్‌ పేమెంట్‌ సిస్టమ్‌

- October 14, 2015 , by Maagulf
హెచ్‌ఎంసి క్లీనిక్స్‌లో క్యాష్‌లెస్‌ పేమెంట్‌ సిస్టమ్‌

హమాద్‌ మెడికల్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎంసి) క్యాష్‌లెస్‌ పేమెంట్‌ సిస్టమ్‌ని బోన్‌ మరియు జాయింట్‌ సెంటర్‌ (ఇంటర్నల్‌ మెడిసిన్‌ క్లినిక్‌లో) ఔట్‌ పేషెంట్స్‌ కోసం ప్రవేశపెట్టింది. క్రెడిట్‌, డెబిట్‌ లేదా ఇ-కార్డుల ద్వారా పేమెంట్స్‌ చెయ్యవచ్చని హెచ్‌ఎంసి వర్గాలు వెల్లడించాయి. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు, ఫీజుల చెల్లింపు సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బోన్‌ అండ్‌ జాయింట్‌ సెంటర్‌లో ఈ ఏర్పాట్లు చేసినట్లు మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మహమ్మద్‌ అల్‌ అతీజ్‌ చెప్పారు. పేషెంట్ల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ అందుకుని వారికి మెరుగైన సౌకర్యాల్ని కల్పిస్తామన్నారాయన. అదనపు చెల్లింపులు ఏమీ లేకుండా, కేవలం వైద్యానికి మాత్రమే ఖర్చు చేసేలా ఈ క్యాష్‌లెస్‌ పేమెంట్‌ సిస్టమ్‌ పేషెంట్లకు ఉపయోగపడ్తుందని రుమైలా హాస్పిటల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com