బ్రిటన్ పార్లమెంటు కంప్యూటర్ నెట్‌వర్క్‌పై సైబర్ దాడి
- June 24, 2017
బ్రిటన్ పార్లమెంటుకు సంబంధించిన కంప్యూటర్ నెట్‌వర్క్‌పై సైబర్ దాడి జరిగింది. శుక్రవారం రాత్రి తమ అధికారిక పార్లమెంటు ఈమెయిల్ ఖాతాలను తెరవలేకపోయామని పలువురు ఎంపీలు తెలిపారు. యూజర్ల ఖతాల్లో ప్రవేశించడానికి హ్యాకర్లు యత్నించినట్లు గుర్తించామని దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి చెప్పారు.
నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్‌తో కలసి తమ కంప్యూటర్ నెట్‌వర్క్ భద్రతను పెంచుతున్నామని చెప్పారు. బలహీనమైన పాస్‌వర్డ్‌లను గుర్తించేందుకు హ్యాకర్లు అన్ని ఖాతాలపైనా దాడికి దిగినట్లు పార్లమెంట్ డిజిటల్ సర్వీసుల బృందం సమాచారం అందజేసింది. బ్రిటన్ ఎంపీలు, అధికారుల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సైబర్ దాడి జరిగింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







