ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై ట్రంప్ ట్వీట్
- June 25, 2017
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నిజమైన స్నేహితుడి’గా వర్ణించారు. సోమవారం శ్వేతసౌధంలో మోదీతో ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్వీట్ చేశారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం అమెరికాలో అడుగుపెట్టారు. వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
తనకు హార్థిక స్వాగతం పలికినందుకు ట్రంప్‌కు మోదీ ధన్యావాదాలు తెలిపారు. ట్రంప్‌తో సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ట్రంప్‌తో మోదీ భేటీకానున్నారు. మరోవైపు ప్రవాస భారతీయులు కూడా మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. విలార్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్లో ఆయనను ప్రవాస గుజరాతీయులు కలిశారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







