పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం ట్యాంకర్‌కు నిప్పంటుకుని 120 మంది సజీవ దహనం
- June 25, 2017
పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అహ్మద్ పూర్ షర్కియా వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. అయితే ట్యాంకర్ నుండి కిందపోతున్న ఆయిల్ ను స్థానికులు పెద్ద ఎత్తున తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
ప్రమాదవశాత్తు ట్యాంకర్ నుండి ఆయిల్ ను తీసుకెళ్తుండగా అగ్ని ప్రమాదం వాటిల్లింది.దీంతో 120 మది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. అయితే ఆయిల్ ట్యాంకర్ సమీపంలో సిగరెట్ తాగడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కూడ 70 శాతం కంటే ఎక్కువగా కాలిపోయారని స్థానికులు చెప్పారు. మృతులను డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







