పవన్‌కి తమ్ముడిగా సరైనోడు విలన్

- June 25, 2017 , by Maagulf
పవన్‌కి తమ్ముడిగా సరైనోడు విలన్

త్రివిక్రమ్‌తో కలసి పవన్‌కల్యాణ్ చేస్తోన్న మూవీ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఐతే, క్యాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకున్నాడు. హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లాంటి క్రేజీ బ్యూటీలను ఎంపిక చేయగా, సీనియర్ నటి ఖుష్బూని కీ రోల్ కోసం తీసుకున్నాడు. అలాగే యంగ్ హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టి కూడా కీలకమైన రోల్ చేస్తున్నాడు.
ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ సినిమాలో పవన్ తమ్ముడిగా నెగటివ్ టచ్ వున్న రోల్లో ఆది కనిపించ నున్నాడట. సరైనోడులో విలన్‌గా అదరగొట్టిన ఆదికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇప్పుడు పవన్ చిత్రంలో నెగటివ్ రోల్ చేయడం, అదీ తమ్ముడిగా అంటే ఆ ఎమోషన్‌ని త్రివిక్రమ్ ఏ రేంజ్‌లో చూపిస్తాడోనని అంచనా వేస్తున్నారు సినీ లవర్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com