మెక్సికోలో రెస్టారెంట్‌పై సాయుధుల దాడి 14 మంది మృతి
- June 25, 2017
మెక్సికో:మెక్సికోలోని వెరాక్రుజ్ రాష్ట్రంలో సాయుధ దుండగులు ఓ రెస్టారెంట్‌పై దాడిచేసి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ కమిషనర్ సహా పద్నాలుగు మందిని హతమార్చారు. మృతుల్లో మరో ఇద్దరు పోలీస్ అధికారులు నలుగురు పిల్లలున్నారు. దేశంలో మాఫియా ముఠాలు పెరిగిపోతున్నాయని, వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామని వెరాక్రుజ్ గవర్నర్ మిగ్వెల్ ఏంజెల్ యూన్స్ అన్నారు. దుండగుల కాల్పుల్లో మరణించిన పోలీస్ కమిషనర్ క్యామిలో కాస్టేగ్న్ రెండు రోజుల క్రితం ఓ కేసు పరిశోధనలో కొన్ని మృతదేహాలను కనుగొన్నాడని చెప్పారు. మాఫియా గ్యాంగ్‌లు హత్యలకు, కిడ్నాప్‌లకు, వసూళ్లకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయని, వారిని తుదముట్టించేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడము అని గవర్నర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మహిళకు 10ఏళ్ల జైలుశిక్ష.. BD5,000 ఫైన్..!!
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి









