ఆన్ లైన్ లో డీజే మూవీ.. షాక్ తిన్న చిత్ర యూనిట్
- June 26, 2017
సినిమా ఇండస్ట్రీకి పట్టిన వైరెస్.. పైరసీ.. అన్నీ భాషల సినిమాలూ.. పైరసీ బాధితులే.. కానీ దక్షిణాది సినిమాలే ఎక్కువగా ఈ పైరసీ వల్ల నష్టబోతున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే కొన్ని సీన్స్ రిలీజ్ కావడం సహజమైపోయింది.. ఇప్పుడు తాజాగా డీజే సినిమా మొత్తం ఎవరో ఆన్ లైన్ లో పెట్టేశారు... అదీ సోషల్ మీడియా ఫేస్ బుక్ లో మొత్తం సినిమా పెట్టడంతో.. అందరూ షాక్ తిన్నారు.. పెట్టిన అరగంటలోనే పదివేల వ్యూస్ తో ఉన్న ఈ వీడియో లింక్ కోసం అందరూ వెదికి చూశారు.. ముఖ్యంగా ఆన్ లైన్ లో పెట్టిన ఈ డీజే సినిమా క్వాలిటీ... బాగుండడం.. వాయిస్ క్లారిటీ ఉండడంతో వీక్షకుల సంఖ్య అధికంగా ఉంది.. కాగా ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకొన్న డీజే బృదం వెంటనే ఎవరు ఆన్ లైన్ లో పెట్టరో తెలుసుకొనే పనిలో పడింది.. దీనికి కంతటికీ కారణం.. సినిమా థియేటర్ లో అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు తీసుకొని వెళ్ళి.. రహస్యంగా చిత్రీకరించి ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని .. షేర్ ఇట్ వంతో యాప్ లతో క్షణాల్లో పక్కవారితో షేర్ చేసుకోవడం ఈగా మారింది.. ఈ నేపద్యంలో ఇటువంటి పైరసీని ప్రభుత్వ పరంగా అదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని.. లేదంటే అదుపు చెయ్యడం కష్టం అని అంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







