పాట చిత్రీకరణలో హీరో గోపీచంద్ చిత్రం 'గౌతమ్నంద'.
- June 26, 2017
గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గౌతమ్నంద'. సంపత్ నంది దర్శకుడు. శ్రీబాలాజి సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జి.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కోసం బ్యాలెన్స్ ఉన్న పాటని చిత్రీకరిస్తున్నారు. " బోలే రామ్ బోలే." రామ్ పల్లవితో సాగే ఈ పాటని గోపీచంద్, హన్సిక పాల్గొంటున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ "రొమాంటిక్ పాటల చిత్రీకరణలో తనదైన ముద్రవేసిన సంపత్నంది 'రచ్చ' సినిమాలో "వాన వాన.", 'బెంగాల్ టైగర్'లో "చూపులతో దీపాల.." పాటల స్థాయిలోనే గౌతమ్నంద పాట ఉంటుంది. యువ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు బృందం నేతృత్వంలో చిత్రీకరించాం. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్ వేశాం. జులైలో గౌతమ్ నంద ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు" అని చెప్పారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్. సౌందర్రాజన్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : సంపత్ నంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







