'మామ్' సెన్సార్ పూర్తి
- June 27, 2017
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై 'మామ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సెన్సార్ బోర్డ్ ఛీఫ్ పహ్లజ్ నిహ్లాని 'మామ్' చూసి తను పొందిన అనుభూతిని తెలియజేస్తూ.. ఈ చిత్రాన్ని న్యూ ఏజ్ మదర్ ఇండియాగా చెప్పొచ్చు. ఇందులో శ్రీదేవి అభినయం నర్గీస్‌ను గుర్తు తెచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టాల్సిందేనని సెన్సార్ సభ్యులు అన్నారు. మంచి కథ, కథనాలతో రవి ఉద్యవర్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా రూపొందించారని, శ్రీదేవి నటన ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, సజల్ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి, ఎడిటింగ్: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్, గిరీష్ కోహ్లి, కోన వెంకట్, స్క్రీన్‌ప్లే: గిరీష్ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్ తల్‌రేజా, గౌతమ్ జైన్, దర్శకత్వం: రవి ఉద్యవార్
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







