మహాభారతం చదువుతున్న బాద్షా

- June 27, 2017 , by Maagulf
మహాభారతం చదువుతున్న బాద్షా

బాలీవుడ్ స్టార్ హీరోలైన ఖాన్ త్రయం ఒకరంటే ఒకరికి పడదని.. బద్ధ శత్రువుల్లా ఉంటారని బీ టౌన్ లో టాక్.. కానీ గత కొంత కాలంగా పరిస్థితులు మారాయి.. హీరోల మధ్య రిలేషన్ లో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బద్ధ శత్రువుల్లా ఉన్న సల్మాన్ ఖాన్  షారూఖ్ ఖాన్ ను మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు... సల్మాన్ ఖాన్ సైకిల్ పై బాంద్రా రోడ్డు మీద విహారం చేస్తూ.. షారూఖ్ ఇంటి ముందు సందడి చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి షారూఖ్ కి రంజాన్ సందర్భంగా బిర్యానీ వెల్లిందట.. తాను ఆ బిర్యానీ తిన్నానని చాలా బాగుంది అని చెప్పాడు.. అంతేకాదు.. తనకు ఇండియన్ ఫుడ్ తయారు చెయ్యడం రాదని.. ఇటాలియన్ ఫుడ్ తయారు చెయ్యడం వచ్చని తెలిపాడు.. అంతేకాదు.. బుల్లి తెరమీద నుంచి వెండి తెరపై అడుగు పెట్టి షారూఖ్ ఖాన్ 25 ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భాన్ని కూడా గుర్తుకు చేసుకొన్నాడు.. తాను ప్రస్తుతం మహాభారతం చదువుతున్నట్లు.. చాలా బాగుంది అని .. జీవితం లో ప్రయాణం మొత్తం మహాభారతంలో పొందుపరిచారని చెప్పాడు. కాగా షారూఖ్ హిందీ మహిళ అయిన గౌరీ ని ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి విధితమే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com