జులై చివరి వారంలో 'కథలో రాజకుమారి'

- June 27, 2017 , by Maagulf
జులై చివరి వారంలో 'కథలో రాజకుమారి'

హైదరాబాద్: వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు నారా రోహిత్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కథలో రాజకుమారి'. నాగశౌర్య మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. నమితా ప్రమోద్, నందిత కథానాయికలు. మహేశ్ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శిరువూరి రాజేశ్వర్మ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తొలుత జూన్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ.. సినిమా అందరికీ చేరువవ్వాలన్న ఆలోచనతో జులై నెలాఖరుకు విడుదల చేయనున్నట్లు దర్శక-నిర్మాతలు తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్కు మంచి స్పందన వస్తోందని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. పరిణతి చెందిన ఓ జంట మధ్య పుట్టే ప్రేమకథే 'కథలో రాజకుమారి'.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com