సుప్రీంకోర్టుపై గ్రనేడ్ల దాడి
- June 27, 2017
వెనిజులా సుప్రీంకోర్టుపై మంగళవారం సాయంత్రం గ్రనేడ్ దాడి జరిగింది. హెలికాప్టర్‌తో చక్కర్లు కొడుతూ.. ఓ పోలీసు అధికారే ఈ దాడికి ఒడిగట్టడం విశేషం. బుధవారం ఉదయం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో గ్రనేడ్ దాడిని నిర్దారించారు. దీనిని ఉగ్రవాద దాడిగానే భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వెనిజులా ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసిన వ్యక్తే హెలికాప్టర్ నడిపాడనీ... ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టుపై విసిరిన గ్రనేడ్లు పేలలేదనీ... బాధ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక భద్రతా దళాలు గాలింపు జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా ఈ ఘటన జరుగుతున్నప్పుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హెలికాప్టర్‌కు 'లిబర్టీ, అర్టికల్ 360' పేరుతో ఓ బ్యానర్ కూడా కట్టారు. మానవ హక్కుల హననం, ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లినప్పుడు దేశంలోని పౌరులు ఆర్టికల్ 360 కింద అక్కడి ప్రభుత్వంపై అవిధేయత ప్రకటించవచ్చు. ''అప్రస్వామిక దళాలు'' ప్రభుత్వంపై తిరగబడితే తనతో పాటు తన మద్దతుదారులు కూడా ఆయుధాలు పట్టాల్సివస్తుందని.. మాడ్యురో ప్రకటించిన గంటల వ్యవథిలోనే గ్రనేడ్ దాడి జరగడం విశేషం.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్‌లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







