'జైలవకుశ' లీక్
- June 28, 2017
ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'జై లవకుశ'. బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను జులై మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కొందరు ఆన్లైన్లో లీక్ చేశారు. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ''జై లవకుశ'లోని సన్నివేశాలను లీక్ చేసిన కొంతమంది నిందితులను గుర్తించి, అరెస్టు చేయించాం' అని ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది.'జై లవకుశ' సన్నివేశాల లీక్ చేసిన ప్రధాన నిందితుడు గణేశ్ అని, అతడ్ని అరెస్టు చేయించామని చిత్ర బృందం తాజాగా తెలిపింది. ఈ మేరకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. లీకైన సన్నివేశాలు అధికారిక టీజర్లోనివి కాదని, కేవలం రఫ్ కట్ మాత్రమే అని చెప్పింది. దయచేసి లీకైన ఫొటోలను షేర్ చేయొద్దని సినీ అభిమానులను చిత్ర బృందం కోరింది.రాశీఖన్నా, నివేదా థామస్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారు. బుల్లితెర హిందీ నటుడు రోనిత్ రాయ్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. నందిత కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







