ఖతారీ డిమాండ్స్‌పై మరో ఆలోచనలేదు: సౌదీ ఫైనాన్స్‌ మినిస్టర్‌

- June 28, 2017 , by Maagulf
ఖతారీ డిమాండ్స్‌పై మరో ఆలోచనలేదు: సౌదీ ఫైనాన్స్‌ మినిస్టర్‌

జెడ్డా, వాషింగ్టన్‌: తీవ్రవాదానికి సహకరించే చర్యలను ఆపాలంటూ ఇప్పటికే ఖతార్‌పై సౌదీ అరేబియా సహా పలు దేశాలు మండిపడుతున్న సంగతి తెలిసినదే. ఖతార్‌తో ఆయా దేశాలు సంబంధాల్ని తెంచుకున్నాయి. ఈ విషయంలో ఇంకో ఆలోచన లేదని సౌదీ అరేబియా ఇంకోసారి స్పష్టం చేసింది. తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాల్ని అందిస్తున్న ఖతార్‌ విషయంలో తాము తెరపైకి తెచ్చిన డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గబోమని సౌదీ ఫారిన్‌ మినిస్టర్‌ అదెల్‌ అల్‌ జుబైర్‌ స్పష్టం చేశారు. మొత్తం తాము ఖతార్‌ ముందుంచిన 13 డిమాండ్లలో అల్‌ జజీరా మూసివేత సహా చాలా అంశాలున్నాయి. యూఎస్‌ సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ రెక్స్‌ టిలెర్‌సన్‌, ఖతార్‌ ఫారిన్‌ మినిస్టర్‌తో గల్ఫ్‌ స్టేట్స్‌ సంక్షోభంపై చర్చలు జరిపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు సౌదీ ఫారిన్‌ మినిస్టర్‌. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్ట్‌, బహ్రెయిన్‌ తదితర దేశాలు జూన్‌ 5న, ఖతార్‌తో అన్ని సంబంధాల్నీ తెంచుకున్నట్లు ప్రకటించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com