వీకెండ్ లైవ్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం
- October 15, 2015
వీకెండ్ లైవ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఈ రోజు ప్రారంభం కానుంది. బహ్రెయిన్‌లోని అతి పెద్ద మాల్ ఇందుకు వేదిక కానుంది. మూడు రోజులపాటు సాగే యమహా మ్యూజిక్ ఫెస్టివల్‌ని బహ్రెయిన్‌లోని అంబాసిడర్ స్టోర్స్ మరియు యమహా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ తయారీ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సిటీ సెంటర్ బహ్రెయిన్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ లైవ్ మ్యూజిక్ ఫెస్టివల్ జరగనుంది. ప్రొఫెషనల్, సెమీ ప్రొఫెషనల్స్‌తోపాటు, ఔత్సాహికులైన మ్యూజీషియన్స్ ఇందులో ప్రదర్శన ఇస్తారు. యమాహా అధికారిక డిజిటల్ పియానిస్ట్ పీటర్ బార్టమాస్ రేపు మరియు శనివారం క్లాసికల్, జాజ్ మరియు పాప్ మ్యూజిక్‌ని మిక్స్ చూస్తూ ఉత్సాహభరితమైన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆరేళ్ళ వయసు నుంచే మ్యూజిక్‌లో ప్రదర్శనలు ఇస్తున్న బార్టమాన్స్ నెదర్‌లాండ్‌లో జన్మించారు. ఈ మ్యూజిక్ లైవ్ షోతోపాటు, సంగీత పరికరాల్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. వీటిల్లో డిజిటల్ పియానోలు, గిటార్‌లు మరియు డ్రమ్ కిట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







