మిసెస్ ఇండియా ఫైనల్ రౌండ్లో: నటుడు అజయ్ భార్య
- June 29, 2017
లక్ష్మీ కళ్యాణం'లో విలన్‌గా చక్కని గుర్తింపు తెచ్చుకున్న అజయ్, 'విక్రమార్కుడు' సినిమాతో ఔరా అనిపించుకున్నాడు. విలన్‌గా పుష్కలమైన అవకాశాలు వస్తున్న సమయంలోనే 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు'లో హీరోగానూ నటించాడు. అయితే అవి రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దాంతో మళ్లీ విలన్ వేషాలపైనే దృష్టిపెట్టాడు.
'విక్రమార్కుడు'లో వీరలెవల్లో విలనిజం పండిచడమైనా, 'ఆర్య 2″లో విలనిజంతో కామెడీని కలగలిపి నవ్వించడమైనా, 'ఇష్క్' సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాజిటివ్ బ్రదర్ క్యారెక్టర్ లో సెంటిమెంట్ పండించడం అయినా, ఇటీవల విడుదలైన 'సుబ్రమణ్యం ఫర్ సేల్'లో చదువుకోని మాఫియా డాన్ గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమైనా కేవలం అజయ్ కే సాధ్యపడింది.
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్న అజయ్ మళ్ళీ ఒక సారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఈ సారి ఆయన భార్య కారణంగా. అజయ్ భార్య శ్వేత రావూరి అందంతో పాటు ఫిట్ గా కూడా ఉంటుంది. అందుకే ఈ సారి జరుగుతున్నా మిసెస్ ఇండియా 2017 పోటీలో పోటీపడింది.
పోటీపడటమే కాకుండా ఫైనల్ రౌండ్ వరకు చేరుకుంది కూడాను. ఈ ఫలితాలు తెలియగానే అజయ్ భార్య శ్వేత క్షణం ఆలోచించకుండా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని ఆమె స్నేహితులతో పంచుకుంది. తన భర్త సపోర్ట్ ఈ విజయంలో మరవలేనిది అని తెగ పొగిడేస్తోంది.
ఆమె ఫిట్నెస్ కోసం చాల కష్టపడింది అని చెబుతున్నారు ఆమె ఫ్రెండ్స్. పెళ్లి అయికా కూడా ఇలాంటి పోటీలుకు వెళ్ళి విజయం సాధించడం అంటే కొంచం ఇప్పుడు ఉన్న వాతావరణంలో కష్టమే అనే చెప్పాలి. నా విజయానికి కారణం మాత్రం నా భర్తే అని గర్వంగా చెబుతుంది శ్వేత.
అజయ్ శ్వేత పెళ్లి 2006లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా మాంచి చిచ్చరపిడుగులే. ఫైనల్ లిస్ట్ లో శ్వేత ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. ఒకవేళ మిస్సెస్ ఇండియా కిరీటంగెలిచే అవకాశాలూ ఉన్నాయి. గతంలో మరో తెలుగు మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి కూడా ఇలా గే మిసెస్ ఇండియా కెరీటం గెలుచుకున్న సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది ఈసారి శ్వేత మళ్ళీ తెలుగు కి ఆ చాన్స్ ఇస్తుందనే అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్‌సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్‌లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్







