యూఏఈ రోడ్లపై దిగిన హెలికాప్టర్‌

- June 29, 2017 , by Maagulf
యూఏఈ రోడ్లపై దిగిన హెలికాప్టర్‌

అబుదాబీ పోలీస్‌ ఎయిర్‌ అంబులెన్స్‌ సిబ్బంది, యూఏఈ రాజధానిలో పలువురు రెసిడెంట్స్‌ని ఈద్‌ అల్‌ ఫితర్‌ సెలవుల సందర్భంగా రక్షించారు. అల్‌ అయిన్‌, అబుదాబీ సిటీలలో జరిగిన ప్రమాదాల్లో గాయపడ్డవారికి తక్షణ సహాయం అందించే విషయంలో ఎయిర్‌ అంబులెన్స్‌ సిబ్బంది చూపిన శ్రద్ధను పలువురు అభినందిస్తున్నారు. అల్‌ అయిన్‌లో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడగా, ఆయన్ని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా తవామ్‌ హాస్పిటల్‌కి తరలించారు. ఇంకో ప్రమాదంలో గాయపడ్డ మహిళను అల్‌ మఫ్రాఖ్‌ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించడం జరిగింది. మరో ఘటనలో ఓ చిన్నారి క్రిటికల్‌ మెడికల్‌ కండిషన్‌తో బాధపడుతుండగా అతన్ని సైతం ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా షేక్‌ ఖలీఫా మెడికల్‌ సిటీకి తరలించడం జరిగింది. ఈ ఘటనల్లో ఎయిర్‌ వింగ్‌ సిబ్బంది, బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం వారిని ఆసుపత్రులకు తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com