20వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి డాక్టర్ మృతి

- June 29, 2017 , by Maagulf
20వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి డాక్టర్ మృతి

షార్జా:  20 వ అంతస్తు నుంచి ఓ వైద్యుడు పట్టు తప్పి కిందకు జారీ దుర్మరణం పాలయ్యాడు.షార్జాలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ విషాదకర సంఘటనలో 62 ఏళ్ల ఇరాక్ డాక్టర్ తన అపార్టుమెంటు బాల్కనీలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా పట్టు తప్పి కిందపడి చనిపోయాడని  ప్రత్యక్షసాక్షి తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.షార్జా పోలీస్ అధికారి " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " గురువారం మాట్లాడుతూ, మృతి చెందిన వైద్యుడు ఒక ఇరాకీ డాక్టర్ అని, మృతునికి సంబంధిన పేరులోని మొదటి మూడు అక్షరాలను మాత్రమే ఆయన తెలిపారు. డాక్టర్ " ఓ ఎస్ టి " గా ఆయనను గుర్తించినట్లు వివరించారు. అంత ఎత్తు నుంచి ఒక్కసారే కిందకు పడటంతో ఆ వైద్యుడు తక్షణమే మరణించారు. "పోలీసు ఆపరేషన్ రూమ్ కు సాయంత్రం 5 గంటల సమయంలో అల్ ఖాన్ ప్రాంతంలో 20 వ అంతస్థు భవనంలోఉన్న బాల్కనీ నుంచి ఓ వ్యక్తి కిందకు పడిపోయాడని నివేదికలు అందుకున్నామని వెనువెంటనే పోలీసులు, అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు తరలించినట్లు తెలిపారు.  సోమవారం సాయంత్రం  6 గంటల సమయంలో అల్ కువైట్ ఆసుపత్రికి తరలించారు, ఆ తర్వాత శవపరీక్ష కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించారు. అనంతరం వైద్యుని మృతికి దారి తీసిన పరిస్థితులపై అల్ బహీరా పోలీసులు విచారణ ప్రారంభించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com