అగ్ని ప్రమాదం: నిద్రలోనే కార్మికుడి దుర్మరణం
- June 29, 2017
37 ఏళ్ళ బంగ్లాదేశీ కార్మికుడు అగ్ని ప్రమాదం కారణంగా నిద్రలోనే అగ్ని కీలలకు ఆహుతైపోయిన దుర్ఘటన షార్జాలో చోటు చేసుకుంది. ఓ కార్ వాష్ సెంటర్‌కి అటాచ్ చేసి ఉన్న ఉడెన్ రూమ్‌లో కార్మికుడు నిద్రపోయాడు. దురదృష్టవశాత్తూ సంభవించిన అగ్ని ప్రమాదంలో అతను ఆహుతైపోయాడు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నకాబి మాట్లాడుతూ, సమాచారం అందుకోగానే ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. ప్రమాదంపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







