హోటళ్ళు 3.2 మిలియన్ల బహెరిన్ దినార్ల ఆదాయాన్ని గడించాయి
- June 29, 2017
మనామా: కింగ్డమ్ లో హోటల్స్ ఈద్ అల్ ఫితర సమయంలో 3.2 మిలియన్ల బహెరిన్ దినార్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఫైవ్ స్టార్స్ హోటళ్లలో 22,000 హోటల్ గదులు బుక్ కాబడ్డాయి. అదేవిధంగా అక్కడ మొత్తం మీద 80 శాతం వరకు యాత్రికులు బస చేసినట్లు ఒక సమాచారం. ఈ గణాంకాలతో పర్యాటక పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి సానుకూల ఫలితాలు ప్రతిబింబించాయి.రాజ్యంలో ఈద్ అల్ ఫిత్ర్ సెలవుల సమయంలో బుకింగ్స్ లతో కిక్కిరిసిపోయ ఉన్నాయి, పండుగ సీజన్లో ప్రయాణికులను ఆహ్వానించడానికి ఎదురుచూస్తున్నాయి అని బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ ఖలీద్ బిన్ హుమద్ అల్ ఖలీఫా అన్నారు. మా ముందున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే,సెలవుదినాలలో ప్రముఖ ఆతిధ్య ప్రదేశంగా కింగ్డమ్ ను తీర్చిదిద్దడం, ఉత్సవ సీజన్లలో పలు కార్యక్రమాలు నిర్వహించడమే మా విధిగా పెటుకొన్నట్లు ఆయన తెలిపారు. ఈద్ అల్ ఫిత్ర్ సెలవులు కూడా 'స్టాక్' ప్రారంభానికి సాక్ష్యమిస్తాయి - మిడిల్ ఈస్ట్ లో మొదటిసారి నిర్వహించిన ఒక కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. జూలై 4-8 నుండి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో లెగో సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







