సౌదీ అరేబియాలో క్షమాభిక్ష మరో 30 రోజుల పొడిగింపు
- June 29, 2017
రియాద్: పెనాల్టీ లేకుండా ఉల్లంఘనులైన వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు ఇప్పటికే ప్రకటించిన క్షమాభిక్ష ఇటీవల ముగియగా, దాన్ని మరో 30 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 25 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వచ్చింది. రెసిడెన్సీ, లేబర్ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించి ఈ అమ్నెస్టీని ప్రకటించారు. 'ఉల్లంఘనలు లేని దేశం' అనే నినాదంతో ఈ క్షమాభిక్షను ప్రసాదించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. మార్చి 29 నుంచి క్షమాభిక్ష పీరియడ్ ప్రారంభమైంది. 90 రోజులకుగాను తొలుత ఈ క్షమాభిక్ష ప్రకటించారు. దాన్ని మరో 30 రోజులకు తాజాగా పొడిగించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ సూచనల మేరకు 30 రోజుల కొత్త క్షమాభిక్షను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







