చైనాకు వార్నింగ్ ఇచ్చిన భారత్
- June 30, 2017
ఓ వైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. సిక్కింలోని భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికులు చొరబాటుకు యత్నించారు. సిక్కిం సెక్టార్‌లోని డోంగ్‌లాండ్ (డోక్లాం) సరిహద్దు ప్రాంతంలోకి చైనా సైన్యాలు చొచ్చుకురాగా, భారత బలగాలు అంతే దీటుగా సమాధానమిస్తున్నాయి. అంతేకాకుండా హద్దుల్లో ఉండాలంటూ చైనాకు వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు భారత్‌కు భూటాన్ తన మద్దతు తెలిపింది. డోక్లాం మూడు దేశాలకు కూడలి వంటిది. ఇది భూటాన్ భూభాగం అయినప్పటికీ చైనా నియంత్రణలో ఉంది.
కాగా డోంగ్‌లాంగ్ ప్రాంతంలో భారత సైన్యం ఆక్రమణకు పాల్పడిందంటూ చైనా విదేశాంగ ప్రతినిధిలు కాంగ్ నిన్న విలేకరుల సమావేశంలో ఓ ఫొటోను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నెల 20న ఇరుదేశాల విదేశాంగశాఖ అధికారుల మధ్య చర్చలు జరిగినప్పటికీ చొరబాట్లు కొనసాగడం చైనాకు పరిపాటిగా మారింది. అంతేకాకుండా డోక్లాం సరిహద్దు నుంచి భారత్ తన సేనలను ఉపసంహరించుకోవాలని చైనా డిమాండ్ చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







