వేర్వేరు ప్రమాదాలలో 6 గురు మహిళలను రక్షించిన దుబాయ్ పోలీసులు
- June 30, 2017
దుబాయ్ : ఒక భవనంలోని లిఫ్ట్ లో అనూహ్యంగా చిక్కుకొన్న ఆరుగురు మహిళలను, ఒక గదిలో తాళం వేయబడి లోపల ఉండిపోయిన అనారోగ్య వ్యక్తిని సైతం దుబాయ్ పోలీస్ ల్యాండ్ రెస్క్యూ విభాగం రక్షించారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దుబాయ్ పోలీస్ వద్ద ఉన్న భూ రక్షణ దళం విభాగం అధిపతి మేజర్ జనరల్ అబ్దుల్లా బిశోహ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈద్ సెలవులు సందర్భంగా ఐదు వేర్వేరు ప్రమాదాల్లో ఈ మహిళలు రక్షించబడ్డారు. అయితే, ఈ సంఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతను తన గదిలో లాక్ చేయబడిన వ్యక్తి, అలాగే ఒక మినీబస్ మరియు రెండు కార్ల ప్రయాణీకులు, అధికారులు నిర్వహించిన సంఘటనల్లో రక్షించబడ్డారు. దుబాయ్‌లో వివిధ ప్రాంతాల్లో వేగవంతంగా పోలీసులు స్పందించడంతో వారినందరిని రక్షించగలిగినట్లు వివరించారు. "ఈ ప్రమాదాల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రజల ప్రాణాలను కాపాడటానికి రెస్క్యూ బృందాల ప్రయత్నాలు విజయవంతమయ్యాయని ఆయన చెప్పారు. ఈ ప్రమాదాలన్నీ వేర్వేరు సంఘటనలుగా నమోదయ్యాయని తెలిపారు. ఈద్ సెలవులు రెండవ రోజు టేలర్ అల్ ఎమరాత్ ప్రాంతంలో ఒక విల్లా ఎలివేటర్ లో చిక్కుకొన్న మహిళలు గురించి ఒక నివేదిక అందుకొని సంఘటనా స్థలానికి తరలించారు ఒక ఎలివేటర్ యొక్క స్విచ్ కీ ఉపయోగించి ఆ మహిళలు రక్షించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







