పేలిన పెట్రోల్ ట్యాంక్, 194 మంది మృతి
- June 30, 2017
పాకిస్థాన్లోని లాహోర్లో పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 194కు చేరింది. గడిచిన 24 గంటల్లోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో చాలామందికి 60 నుంచి 100శాతం వరకు కాలిన గాయాలయ్యాయని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే వీరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
కరాచీ నుంచి లాహోర్కు 50వేల లీటర్లతో వెళ్తున్న ఓ పెట్రోల్ ట్యాంకర్ ఆదివారం ఉదయం బహావాల్పూర్ జిల్లా అహ్మద్పూర్ షర్కియా ప్రాంతంలో బోల్తా కొట్టింది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ విరజిమ్మడం గమనించిన స్థానికులు.. క్యాన్లు, బకెట్లు పట్టుకుని అక్కడికి వెళ్లారు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ అంటించడంతో క్షణాల్లో మంటలు చెలరేగి.. ట్యాంకర్ పేలిపోయింది.
ప్రమాదం ధాటికి 151 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 140మంది వరకు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో చాలామంది శరీరం పూర్తిగా కాలిపోయిందని అధికారులు చెప్పారు.
చికిత్స పొందుతూ మరో 43 మంది మృతిచెందారు. మృతులంతా అగ్నికి పూర్తిగా ఆహుతవడంతో గుర్తించడానికి వీలులేకుండా పోయింది. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను గుర్తిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







