ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
- July 01, 2017
ఇండిగో విమానానికి బీఎస్ఎఫ్ విమానానికి మధ్య పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు అతి సమీపంలో నుంచి దూసుకెళ్లాయి. పైలట్లు అప్రమత్తమవడంతో ఈ ప్రమాదం తప్పింది. బీఎస్ఎఫ్ విమానంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఉండటం మరింత భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనను ఇండిగో సంస్థకు చెందిన అధికారిక ప్రతినిధి ధ్రువీకరించారు. వివరాల్లోకి వెళితే.. ఇండిగోకు చెందిన విమానం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వస్తోంది.
అదే సమయంలో బీఎస్ఎఫ్కు చెందిన విమానం కూడా అదే మార్గంలో ఎగురుతోంది. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెరిషీ కూడా ఉన్నారు. తమ విమానం 26వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న సమయంలో బీఎస్ఎఫ్ విమానం 25వేల అడుగుల ఎత్తులో ఉందని, మరింత పైకి రావడం ప్రారంభించిందని ఇండిగో ప్రతినిధి చెప్పారు. దీనిని గుర్తించిన ఇండిగో పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారని, దీంతో ఏటీసీ వెంటనే బీఎస్ఎఫ్ విమానానికి ప్రమాద సంకేతాలు పంపించడంతో ఊపిరిపీల్చుకున్నట్లయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







