చర్చకు రానున్న న్యూ ల్యాండ్‌ బిల్‌

- July 01, 2017 , by Maagulf
చర్చకు రానున్న న్యూ ల్యాండ్‌ బిల్‌

మనామా: నాన్‌ బహ్రెయినీలు తమ స్థలంలో కొనుగోలు చేసిన ఐదేళ్ళలోపు భవనాన్ని నిర్మించేలా కొత్త ల్యాండ్‌ బిల్‌ పార్లమెంటరీ ప్రపోజల్‌లో ఉంది. ఈ ప్రపోజల్‌కి ఇప్పటికే ప్రాథమికంగా మద్దతు లభించింది. ఫారిన్‌ ఎఫైర్స్‌, డిఫెన్స్‌ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ ఇప్పటికే హౌస్‌ ఆఫ& రిప్రెజెంటేటివ్స్‌లో పాస్‌ చేయడం జరిగింది. ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌, జిసిసి నేషనల్స్‌ కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. అయితే సర్వే మరియు ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ బ్యూరో, కమిటీకి కొన్ని హెచ్చరికలు కూడా చేసింది. ఈ బిల్లు కారణంగా లార్జ్‌ కమర్షియల్‌ మరియు టూరిజం ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అందులో పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో సమానంగా జిసిసి దేశాలకు చెందిన ఇన్వెస్టర్స్‌ని పోల్చడాన్ని బ్యూరో తప్పుపట్టింది. మంగళవారం జరిగే సమావేశంలో 40 మంది సభ్యులు గల కౌన్సిల్‌ ఈ బిల్లుపై చర్చించి, ఓటింగ్‌ చేయనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com