ఖతార్‌కి వ్యతిరేకంగా గ్లోబల్ క్యాంపెయిన్ ప్రారంభం
- July 01, 2017
దుబాయ్: వివిధ దేశాలకు చెందిన యాక్టివిస్టులు, తీవ్రవాదానికి ఖతార్ ఆర్థిక సహాయం అందించడానికి వ్యతిరేకంగా గ్లోబల్ క్యాంపెయిన్‌ని చేపట్టారు. జూన్ 30న ఈ క్యాంపెయిన్ ప్రారంభమయ్యింది. వియెన్నాలోని ఖతార్ ఎంబసీ ఎదురుగా ఈ ఆందోళనా కార్యక్రమాన్ని నిరసనకారులు ప్రారంభించారు. ప్రపంచానికి శతృవుగా మారిన తీవ్రవాదానికి ఖతార్ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడాన్ని నిరసనకారులు ప్రశ్నించారు. తీవ్రవాద బాధితుల నుంచి సేకరించిన సమాచారాన్ని, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎలుగెత్తి చాటతామని, తీవ్రవాద సంస్థలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయ సహకారాలు అందిస్తున్న ఖతార్‌కి వ్యతిరేకంగా తమ పోరాటం ముందు ముందు మరింత ఉధృతమవుతుందని వారు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆందోళనా కార్యక్రమాలు జరగనున్నాయని వారు వివరించారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







