అబూదాబి లో అట్టహాసంగా సైమా అవార్డ్స్
- July 01, 2017_1498970882.jpg)
'సైమా' (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక అబుదాబిలో... మన తారల సంబరాలు అంబరాన్ని తాకాయి. దక్షిణాది అంతా.... అక్కడికి తరలిపోయిందా? అనేలా... ఎటు చూసినా మన తారలే కనిపించారు. అవార్డుల ముచ్చట్లు, కేరింతలు, నృత్యాలు, తారల ఛలోక్తులు... ఇలా ప్రతి క్షణం ఆనంద వీక్షణంలా సాగింది. శుక్రవారం రాత్రి మొదలైన హంగామా తెల్లవారే వరకూ సాగింది. రానా, లక్ష్మి మంచు, అలీ 'సైమా' కోసం వ్యాఖ్యాతలుగా మారారు. 'దువ్వాడ జగన్నాథమ్' అవతారం ఎత్తాడు అల్లు శిరీష్. 'కేకః కేకస్య కేకోభ్యః' అంటూ అన్నయ్య డైలాగుల్ని వేదికపై గుర్తు చేసి అలరించాడు. రెజీనా, పూజా హెగ్డే తన ఆట పాటలతో కేరింతలు కొట్టించారు. నటుడు, నిర్మాత మురళీమోహన్ జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు.ఇటీవల దివికేగిన దర్శకరత్న దాసరి నారాయణరావుని స్మరించుకొంటూ.. దాసరి అరుణ్కుమార్లో దాసరిని చూసుకొంటూ సన్మానించుకొంది. ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్) ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తమ కథానాయికగా (నాన్నకు ప్రేమతో) అవార్డు అందుకొంది.
అప్పుడు ఆట.. ఇప్పుడు పాట:
మన కథానాయకులు ఇటీవల గాయకులవుతున్నారు. తాజాగా అఖిల్ ఆ జాబితాలో చేరిపోయాడు. సైమా వేదికపై ఓ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత సైమా వేడుకల్లో స్టెప్పులతో అలరించిన అఖిల్ ఈసారి పాట పాడి ఆకట్టుకున్నాడు. అఖిల్ ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వరపరచిన 'ఏవేవో కలలు కన్నా' అనే గీతాన్ని ఈ వేదికపై ఆలపించాడు అఖిల్.
పురస్కార విజేతల వివరాలు
చిత్రం: పెళ్లి చూపులు
దర్శకుడు : వంశీ పైడిపల్లి (వూపిరి)
తొలి చిత్ర కథానాయిక : నివేదా థామస్ (జెంటిల్మెన్)
తొలి చిత్ర కథానాయకుడు : రోషన్ (నిర్మలా కాన్వెంట్)
ప్రతినాయకుడు : జగపతిబాబు (నాన్నకు ప్రేమతో)
హాస్యనటుడు : ప్రియదర్శి (పెళ్లి చూపులు)
సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (జనతా గ్యారేజ్)
గీత రచయిత: రామ జోగయ్యశాస్త్రి (జనతా గ్యారేజ్)
నటుడు (క్రిటిక్స్): నాని (కృష్ణగాడి వీర ప్రేమగాథ)
సహాయనటుడు: శ్రీకాంత్ (సరైనోడు)
_1498970901.jpg)




తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







