డొమెస్టిక్‌ వర్కర్స్‌కి గుడ్‌ న్యూస్‌!

- July 02, 2017 , by Maagulf
డొమెస్టిక్‌ వర్కర్స్‌కి గుడ్‌ న్యూస్‌!

ప్రైవేటు ఏజెన్సీలు ఇప్పటిదాకా డొమెస్టిక్‌ వర్కర్స్‌ రిక్రూట్‌మెంట్‌ని చేపడుతుండడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ రంగంలో డొమెస్టిక్‌ వర్కర్స్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యలకు చెక్‌ పెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా రిక్రూట్‌మెంట్స్‌ చేపట్టేలా ఓ ప్రపోజల్‌ గురువారం హౌస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌లో ఓటింగ్‌కి రానుంది. ఈ ప్రపోజల్‌ పాస్‌ అయితే, కింగ్‌డమ్‌లో ప్రైవేటు రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల మోనోపలీకి అడ్డుకట్ట పడుతుంది. రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్స్‌ నుంచి తమకు వేధింపులు తగ్గుతాయనీ, రిక్రూట్‌మెంట్స్‌లో పారదర్శకత ఏర్పడుతుందని ఈ ప్రపోజల్‌ పట్ల డొమెస్టిక్‌ వర్కర్స్‌ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ అలాగే మినిస్ట్రీకి చెందిన అధికారులు హౌస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌ సమావేశానికి హాజరు కానున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com