దేశం విడిచివెళ్ళేవారికి ఖతార్‌ ఆంక్షలు

- July 02, 2017 , by Maagulf
దేశం విడిచివెళ్ళేవారికి ఖతార్‌ ఆంక్షలు

ఖతార్‌ ప్రభుత్వం తమ పౌరులు, నివాసితులు దేశం విడిచి వెళ్ళేందుకు ఆంక్షలు విధించింది. కొన్ని విభాగాలకు చెందినవారికి లీవ్‌ మంజూరు చేయకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ శాఖలకు చెందినవారిపై ఈ బ్యాన్‌ విధించడం జరిగింది. దేశంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా పౌరులు, నివాసితులకు ఎలాంటి సమస్యలూ రాకుండా చూసే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గం కనిపించకపోవడంతో ఖతార్‌, తమ ప్రజలు నివాసితులపై ఉక్కుపాదం మోపుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఖతార్‌ తీవ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తోందంటూ, ఖతార్‌తో సంబంధాల్ని పలు దేశాలు తెగతెంపులు చేసుకున్న దరిమిలా ఖతార్‌లో పరిస్థితులు కొంత ఆందోళనకంగా మారాయి. అయితే ఖతార్‌ మాత్రం తమ దేశంలో పౌరులు, నివాసితులు ఎవరూ ఆందోళన చెందే పరిస్థితులు లేవనీ, తమ ఆర్థిక వ్యవస్థ అత్యంత పరిపుష్టంగా ఉందని చెబుతోంది. ఎవరెంతలా తమతో సంబంధాలు తెంచేసుకున్నా ఏళ్ళ తరబడి ధైర్యంగా మనుగడ సాధించే శక్తి ఉందన్నది ఖతార్‌ వాదన. కానీ పరిశీలకుల వాదన ఇంకోలా ఉంది. ఖతార్‌ ప్రభుత్వంలో ఆందోళన పెరిగిందనీ, అభద్రతాభావంతోనే పౌరులకు సెలవుల్ని రద్దు చేసిందని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com