డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి ప్రముఖ పీఆర్‌ఓ

- July 04, 2017 , by Maagulf
డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి ప్రముఖ పీఆర్‌ఓ

హైదరాబాద్: సినిమా నిర్మాణం కంటే డిస్ట్రిబ్యూషన్‌ చాలా కష్టమని అంటుంటారు. ఆడియన్స్‌ పల్స్‌ పట్టుకోవడం అంత తేలిక కాదు​. అలా పట్టుకున్నవారే మంచి డిస్ట్రిబ్యూటర్లుగా పేరు సంపాదించుకుంటారు. సినిమా మీద ప్యాషన్‌తో ఎంతోమంది ఈ రంగంలోకి రావడం, అట్నుంచటే సినీ నిర్మాణంవైపు అడుగులు వేయడం చూస్తున్నాం. ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్‌ రాజు కూడా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోంచే నిర్మాణ రంగం వైపుకు వచ్చారు. ఇంకెందరో ఉన్నారు ఈ బాటలో. లేటెస్ట్‌గా రవి పనస అనే పీఆర్‌ఓ సినీ డిస్ట్రిబ్యూషన్‌ వైపు అడుగులేస్తున్నారు. సినీ పరిశ్రమలో రవి పనస ప్రతి ఒక్కరికీ తెలిసిన వ్యక్తే. అందరితో సత్సంబంధాలు ఆయన ప్రత్యేకం. సినీ రంగంలో అపార అనుభవం సొంతం చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నారాయన. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ రూపొందిస్తున్న 'నక్షత్రం' సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా మారుతున్నారు రవి పనస. ఆడియన్స్‌ పల్స్‌ తెలిసిన వ్యక్తిగా, రవి పనస ఫిలిం కార్పొరేషన్‌ (ఆర్‌పిఎఫ్‌సి) స్థాపించి, డిస్ట్రిబ్యూటర్‌గా మారబోతున్నారాయన. నైజాంలో దిల్‌ రాజు, సుధాకర్‌రెడ్డి, నామా అభిషేక్‌ వంటివారు డిస్ట్రిబ్యూటర్లుగా టాప్‌ స్లాట్‌లో ఉన్నారు. వారి సరసన రవి పనస చేరాలని, తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిద్దాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com