పోలీస్‌ స్టేషన్లలో మల్టీ స్టోరీ పార్కింగ్‌

- July 04, 2017 , by Maagulf
పోలీస్‌ స్టేషన్లలో మల్టీ స్టోరీ పార్కింగ్‌

పోలీస్‌ స్టేషన్లకు దగ్గరలో పార్కింగ్‌ కోసం ఇకపై పెద్దగా ప్రయాస ఉండకపోవచ్చు. దుబాయ్‌ పోలీసులు, ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు. పోలీస్‌ స్టేషన్‌ని సందర్శించేవారికి పార్కింగ్‌ సమస్యలను తగ్గించడం కోసం మల్టీ స్టోరీ స్మార్ట్‌ పార్కింగ్‌ సిస్టమ్‌తో చెక్‌ పెడతామని దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా ఖలీఫా అల్‌ మెర్రి చెప్పారు. నైఫ్‌, రిఫ్ఫా, మురాఖాబాత్‌ పోలీస్‌ స్టేషన్లలో తొలి ఫేజ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టుని అమలు చేయనున్నారు. స్మార్ట్‌ పోలీసింగ్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ని సందర్శకుల కోసం రూపొందిస్తున్నట్లు దుబాయ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూస్‌ అండ్‌ ఫండ్‌ ఇన్‌ది ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ బ్రిగేడియర్‌ నయీమ్‌ అల్‌ ఖతీబ్‌ చెప్పారు. ప్రస్తుతం మల్టీ స్టోరీ స్మార్ట్‌ పార్కింగ్‌ కోసం పలు రకాలైన మోడల్స్‌ని అధ్యయనం చేస్తున్నామనీ, అధ్యయనం పూర్తికాగానే ప్రాజెక్టులను ప్రారంభిస్తామని అన్నారు. స్మార్ట్‌ మెకానిజం ద్వారా కారు పార్క్‌ చేయాలనుకున్న వ్యక్తికి ఓ టిక్కెట్‌ అక్కడిక్కడే ఇవ్వడం జరుగుతుందనీ, ఆ టిక్కెట్‌ని తిరిగి వెళ్ళే సమయంలో ఇన్‌సెర్ట్‌ చేస్తే, ఎవరి ప్రమేయమూ లేకుండా కారు పార్కింగ్‌ స్లాట్‌ నుంచి ఆ వ్యక్తికి ఆ కారు అందుతుందని అల్‌ ఖతీబ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com