క్యాపిటల్‌లో అగ్ని ప్రమాదం

- July 04, 2017 , by Maagulf
క్యాపిటల్‌లో అగ్ని ప్రమాదం

క్యాపిటల్‌లోని కువైటి బిల్డింగ్‌ వెనుక ఓ రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అలి అబ్దుల్‌ గుఫూల్‌కి చెందిన ఈ భవనంలో ఆన సోదరుడు, తల్లి నివసిస్తున్నారు. అదృష్టవశాత్తూ అ కుటుంబానికి అగ్ని కీలల కారణంగా ఎలాంటి అపాయం జరగలేదు. మెయిన్‌ డోర్‌ వైపుగా పొగ కమ్ముకోవడంతో ఏసీవెంట్‌ ద్వారా కుటుంబం సురక్షితంగా బయటకు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో భవనానికి కూడా అగ్ని కీలలు వ్యాపించాయి. అయితే అక్కడా ఎవరికీ ప్రమాదం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com