పాకిస్తాన్లో రూపాయి 'ఢమాల్':భారీ పతనం.. తొమ్మిదేళ్లలో అత్యంత కనిష్టం..
- July 06, 2017
పాకిస్తాన్లో రూపాయి విలువ అంతకంతకూ పడిపోతూనే ఉంది. మునుపెన్నడూ లేని రీతిలో గత తొమ్మిదేళ్లలో రూపాయి విలువ అత్యంత భారీగా పతనమైంది. డాలర్ తో ప్రస్తుతం పాక్ రూపాయి మారకం విలువ 3.1శాతం మేర పడిపోయి 108.1గా నమోదైంది.
రూపాయి విలువ పతనం అక్కడి కేంద్ర బ్యాంకు వ్యూహాత్మక ఎత్తుగడగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ముందుగా దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం తలెత్తనుందన్న సంకేతాల నేపథ్యంలో.. రూపాయి విలువను కేంద్ర బ్యాంకే డీవాల్యుయేట్ చేయడానికి అనుమతినిచ్చింది. దీంతో 2013డిసెంబర్ తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ చేరుకుంది.
ఇంట్రా బ్యాంకు సిస్టమ్ ద్వారా చేసే దిగుమతుల చెల్లింపునకు సెంట్రల్ బ్యాంకు ఈ డీవాల్యుయేషన్ చేపడుతుందని బీఎంఏ క్యాపిటల్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ ఫవద్ ఖాన్ తెలిపారు. తద్వారా పేరుకుపోతున్న లోటును తగ్గించవచ్చునని కేంద్రబ్యాంకు భావిస్తోంది. దీనికి తోడు ఎగమతులు కూడా ఊపందుకుంటాయని చూస్తోంది.
కాగా, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పాకిస్తాన్ వాణిజ్య లోపు 60శాతం పెరగడం గమనార్హం. మే నెలతో ముగిసిన 11నెలల కాలంలో పాకిస్తాన్ ప్రస్తుత వాణిజ్య లోటు మరో రెండింతలు పెరిగి 8,9బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయికి బలం చేకూర్చడంతో ప్రస్తుత లోటును తగ్గించవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









