'జై' రికార్డులు బద్దలు కొడుతోంది
- July 07, 2017
ఎన్టీఆర్ , నివేద థామస్ , రాశి ఖన్నా జంటగా బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ 'జై లవకుశ'. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. టీజర్ లో జై రోల్ కు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు జై జైలు కొడుతున్నారు. ఎక్కడ చూసిన ఈ టీజర్ గురించి , ఎన్టీఆర్ నటన గురించి గొప్పగా చెపుతున్నారు.
అంతే కాదు టీజర్ విడుదలైన తొలి 100 నిమిషాల్లోనే లక్ష లైక్‌లు వచ్చాయంటే టీజర్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో 4 లక్షలకు పైగా వ్యూస్, ఐదు లక్షల డిజిటల్ వ్యూస్‌తో రికార్డ్ సృష్టించినట్లు చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఈ టీజర్ టాలీవుడ్లో రికార్డ్ సృష్టించింది అంటూ పోస్టర్ షేర్ చేసారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'జై', 'లవ', 'కుశ' అనే మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. నిన్న జై కు సంబదించిన టీజర్ రిలీజ్ చేసారు. అలాగే మిగతా రెండు రోల్స్ కు సంబదించిన టీజర్లు కూడా రిలీజ్ చేస్తారట. దసరా పండుగను పురస్కరించుకుని చిత్రాన్ని సెప్టెంబర్21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







