ఆలస్యం ఖరీదు 1బిలియన్ డాలర్ల నష్టం..
- July 07, 2017
పారిస్ : ఎయిర్‌బస్‌కు చెందిన జెట్ విమానాల కొనుగోలు కోసం చేసిన నాలుగు ఆర్డర్లను ఖతార్ ఎయిర్‌లైన్స్ వెనక్కి తీసుకుంది. డెలివరీలో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఆర్డర్లను వెనక్కితీసుకోవడంతో 'ఎయిర్‌బస్' సంస్థకు దాదాపు 1.2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లనుంది.
ఖతార్ విమానయాన సంస్థ నాలుగు ఏ350 జెట్ విమానాల కోసం గతంలో ఎయిర్‌బస్‌కు ఆర్డర్లు ఇచ్చింది. 'నాలుగు జెట్ విమానాల కోసం మేమిచ్చిన ఆర్డర్లను త్వరగా డెలివరీ చేయాలని కోరాం. అయితే డెలివరీలో ఆలస్యమైంది. ఎలాంటి ఆలస్యానికైనా ఎయిర్‌బస్ సంస్థనే బాధ్యతవహించాలని మేం గతంలోనే చెప్పాం' అని ఖతార్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్బకార్ తెలిపారు. పలు సమస్యల కారణంగా వీటి డెలివరీలో ఆలస్యమైనట్లు ఎయిర్‌బస్ ప్రతినిధి తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ నాలుగు జెట్ విమానాలను తిరిగి అమ్మాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







