నిర్మాతగా మారిన ఒక్కప్పటి ఫేమస్ విలన్

- July 09, 2017 , by Maagulf
నిర్మాతగా మారిన ఒక్కప్పటి ఫేమస్ విలన్

'నాన్ కడవుల్' చిత్రం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రాజేంద్రన్. మొట్టె రాజేంద్రన్గాను గుర్తింపు తెచ్చుకున్నారు. స్టంట్ కళాకారుడిగా కెరీర్ను ప్రారంభించి ఇప్పుడు కోలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హాస్య నటుడు స్థాయికి ఎదిగారు. వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన ఇప్పుడు నిర్మాతగా మారారు. టీఎన్ 75 కేకే క్రియేషన్స్ పేరిట ఓ సంస్థను రూపొందించి 'ఎంగడా ఇరుందీంగ ఇవ్వలవునాలా' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్నారు. 'చదురంగవేట్టె' ఫేమ్ ఇషారానాయర్, 'కమర్కట్టు' ఫేమ్ రహానా, సహానా, కృష్ణప్రియలు కథానాయికలు. రాజేంద్రన్, మనోబాలా, బాలాసింగ్, శివశంకర్, షకీలా ఇతర తారాగణం.
'పురంబోక్కు' ఫేమ్ వర్షన్ సంగీతం సమకూర్చుతున్నారు. కథ, మాటలు, స్క్రీన్ప్లే సమకూర్చిన కెవిన్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. సినిమా విశేషాల గురించి ఆయన మాట్లాడుతూ 'ప్రతిరోజూ ఎంతోమంది కడుపుచేతపట్టుకుని చెన్నైకి వస్తుంటారు. వారిలో సినిమా అవకాశాల కోసం వస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువే.
అలా ఓ గ్రామానికి చెందిన కథానాయకుడు సినిమా అవకాశం కోసం చెన్నైకి వస్తాడు. అతనికి అవకాశాలు దక్కకపోవడంతో వేరేదారి లేక మళ్లీ గ్రామానికే వెళ్లిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న వూరిపెద్ద రాజేంద్రన్.. అతని కోసం తన ఆస్తులను అమ్మి సినిమా తీస్తాడు.
ఆ తర్వాత ఏమైందన్నదే చిత్ర కథ. మాయవరం, కుంభకోణం, చెన్నై, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలోనే విడుదల చేయనున్నామని' వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com