పెరూదేశంలో బస్సు ప్రమాదం: 9మంది మృతి
- July 10, 2017
పెరూ దేశంలో జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. డబుల్ డెక్కర్ టూరిస్టు బస్సు అదుపుతప్పి కొండపై నుంచి పడడంతో తొమ్మిదిమంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కెనడియన్, చిలీ దేశస్తుడు కూడా ఉన్నారని రక్షణ సిబ్బంది తెలిపారు.
ఈ సంఘటన లిమాలో అధ్యక్షుడి భవనానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆదివారం రాత్రి జరిగిందని పెరూ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. నగర అందాలను చూసేందుకు స్థానిక బస్సు శాన్ క్రిస్టోబల్ కొండపై వెళ్తున్నపుడు ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ఆ సమయంలో బస్సు అతివేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







