దుబాయ్ లో మహిళను హత్య చేసిన వ్యక్తి.. భవనం వెలుపల ఖననం

- July 10, 2017 , by Maagulf
దుబాయ్ లో  మహిళను హత్య చేసిన వ్యక్తి.. భవనం వెలుపల ఖననం

నగరంలోని ఓ భవనంలో పనిమనిషిగా జీవనం కొనసాగిస్తున్న ఓ నేపాలీ మహిళ హత్యకు గురైంది. కలకలం రేపిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలియజేశారు. అల్ బర్షా ప్రాంతంలోని ఓ భవన ఆవరణలో మహిళ మృతదేహం ఉందని పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరపగా కంగుతినే నిజాలు తెలిశాయి. 
హత్యకు గురైన మహిళ.. తాను పని చేస్తున్న భవనంలో పనిచేస్తున్న, తన దేశానికే చెందిన వ్యక్తితో కొంతకాలంగా అక్రమసంబంధాన్ని కొనసాగిస్తోంది. హత్యకు జరిగిన రోజు నిందితుడి రూంకు మహిళ వెళ్లింది. ఇద్దరూ కలిసి రోజంతా చాలాసేపు గడిపారు. మధ్యాహ్నం భోజనం చేశారు. లైంగికంగా కలిశారు. అనంతరం పనికి వెళ్తున్న నిందితుడిని వెళ్లోద్దంటూ, తనతో గడపాలని మృతురాలు అడ్డగించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. నిందితుడు బయటకు వెళ్తుండగా ఆమె గట్టిగా అరిచింది. అరవకుండా నోరు మూసిన నిందితుడు ఆమెను బాత్‌రూంలోకి ఈడ్చుకెళ్లాడు. అనంతరం బెడ్‌రూంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. పనికి వెళ్లి తిరిగొచ్చే సరికి ఆమె చనిపోయిఉందని, ఉద్దేశ్యపూర్వకంగా చంపలేదని నిందితుడు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటల్లో బలమైన గాయాలవ్వడంతో మహిళ చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కోర్టులో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com