కార్ టింటింగ్ రూల్ప్ మార్పు
- July 10, 2017
దుబాయ్: ప్రస్తుతం ఉన్న 30 శాతం టింట్ రూల్స్‌ని సవరించి 50 శాతం టింట్స్ వేసుకునేలా వాహనదారులకు ఉపశమనం కలిగిందని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ట్రక్లు, ట్యాక్సీలు మినహా వాహనాలన్నీ ఈ నిబంధన కింద ఉపశమనం పొందుతాయని అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ ఆపరేషనల్ ఎఫైర్స్ మేజర్ జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జఫీన్ చెప్పారు. జులై 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. అయితే టింట్ నిబంధన మార్పు ముందు విండ్ స్క్రీన్‌కి వర్తించదు. రెంటల్, కంపెనీ కార్లు కూడా 50 శాతం టింట్ చేసుకోవచ్చు. ఇంకో వైపు మేజర్ జనరల్ అల్ జెఫీన్ మాట్లాడుతూ, చైల్డ్ సీట్స్‌కి సంబంధించి కార్లలో తగిన స్పేస్ ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, దుబాయ్‌లో గత కొన్నాళ్ళుగా ఉన్న వైట్ పాయింట్స్ సిస్టమ్‌ని దేశమంతటా అమలు చేయనున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ని పాటించేవారికి రివార్డ్ అందించేందుకు వీలుగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకి రెండు పాయింట్స్‌ని అందిస్తారు. ఈ పాయింట్స్, ట్రాఫిక్ జరీమానాలు విధింపబడితే మైనస్ అవుతాయి. ఒక్క పాయింట్ కూడా కోల్పోనివారికి రివార్డ్ అందివ్వడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







