మహిళను చంపి, విల్లా బయట పడేశారు
- July 10, 2017
మహిళను చంపి, మృతదేహాన్ని విల్లా బయట పడేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలు నేపాల్‌కి చెందిన వ్యక్తి. నేపాల్‌కి చెందిన నిందితుడ్ని మే 21న అల్ బర్షా ఏరియాలోని విల్లా నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఓ పాకిస్తానీ వ్యక్తి, విల్లా బయట ఓ మహిళ మృతదేహం చూసినట్లు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు, విచారణలో మృతురాలికి నేపాలీ వ్యక్తితో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు విల్లాలో కీలనర్గా పనిచేస్తున్నాడు. ఆ మహిళతో అదే విల్లాలో శారీరక సంబంధం కొనసాగించిన నిందితుడు, చిన్న గొడవ కారణంగా ఆమెపై దాడికి దిగాడు. ఆమెను ఓ చోటకి తోసేసి, వెళ్ళిపోయాడతడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆమె చనిపోయినట్లు గుర్తించిన నిందితుడు, ఆమె మృతదేహాన్ని బయట పడేశాడు. విచారణలో ఈ విషయాల్ని పోలీసులు బయటపెట్టారు. అయితే నిందితుడు తాను కావాలని ఆమెను చంపలేదని పోలీసులకు తెలిపాడు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







