మరో మలయాళీ వారసురాలి తెరంగేట్రం
- July 10, 2017
మరో నట వారసురాలు కథానాయకిగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ కూతురు కల్యాణి కథానాయకిగా తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. దర్శకుడు ప్రియదర్శన్, లిజీలకు కల్యాణి, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండేళ్ల కిందట ప్రియదర్శన్, లిజీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు లిజీ సంరక్షణలోనే పెరుగుతున్నారు. న్యూయార్క్‌లో చదువు పూర్తి చేసిన కల్యాణి సినీరంగంపై ఆసక్తి కనబరుస్తోంది.
ఇప్పటికే విక్రమ్, నయనతార జంటగా నటించిన ఇరుముగన్ చిత్రానికి సహాయదర్శకురాలిగా పని చేసింది. కాగా కల్యాణిని కథానాయకి చేసే పనిలో ఆమె తల్లి లిజీ ముమ్మరంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శక్వతం వహిస్తున్న తెలుగు చిత్రంలో యువ నటుడు అఖిల్‌కు జంటగా కల్యాణి ఎంపికయినట్లు తాజా సమాచారం. నాగార్జున నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మరో పది రోజుల్లో కల్యాణి ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు సినీవర్గాల సమాచారం. కాగా విక్రమ్‌కుమార్ కల్యాణి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ శిష్యుడన్నది గమనార్హం. అదే విధంగా కల్యాణి మరో మలయాళ చిత్రంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







