డైరెక్టర్ మణిరత్నం, హీరో రామ్‌చరణ్‌ల ద్విభాషా చిత్రం
- July 10, 2017
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నూతన చిత్రానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. కాట్రువెలియిడై చిత్రం తరువాత ఆ దర్శకుడు తదుపరి చిత్ర పనుల్లో మునిగిపోయారు. ఈ సారి భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్‌చరణ్, మాలీవుడ్ నటుడు ఫాహద్ పాజిల్‌ల కాంబినేషన్‌లో తమిళం, తెలుగు భాషల్లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. రామ్‌చరణ్ ప్రస్తుతం రగస్థలం అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.
దీని తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో ఒకరుగా కాట్రువెలియిడై చిత్రం ఫేమ్ అదిథిరావు నటించనున్నారట. మరో కథానాయకి ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. కాగా మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు కట్టనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంతకుముందు మణిరత్నం చిత్రాలు దళపతి, రోజా, ఇరువర్, ఉయిరే, రావణన్ చిత్రాలకు సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రం సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







