ఎయిర్ ఇండియా లో మాంసాహారం బంద్ పై దుమారం
- July 10, 2017
ఉరుము ఉరిమి మంగలం మీద పడిందంటే ఇదేమరి. ఎయిరిండియా మహారాజావారికి మహా కోపం వచ్చేసింది. ఎన్ని సర్వీసులు నడిపినా, ఎన్ని పొదుపు చర్యలు పాటించినా, ఖర్చులను ఎంత కంట్రోల్ చేసినా సంస్థ అప్పులు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయే బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి అని మథనపడి మథనపడి చివరకు ఒక కఠోర నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ధరల టిక్కెట్లతో ప్రయాణించే ప్యాసింజర్లకు మాంసాహారం కట్ చేశారు. అంతపెద్ద మహాజారావారికి తక్కువ క్లాసు వారిమీదే చూపు పడింది. గంగమ్మకు పోతరాజులాగా అన్నమాట. ఇంకేం ఇక నుంచి మీరు మా విమానాల్లో ప్రయాణించేటప్పుడు మీకు మాంసం వడ్డంచం పోండని చెప్పి చేతులు దులుపుకుంది. అది కూడా దేశీయ విమానాల్లోనే అట. ఎయిరిండియా తన అప్పుల భారం తగ్గించుకునేందుకు ఎన్నుకున్న పరిష్కారం ఇదన్నమాట.
దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించబోమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇకపై కేవలం శాకాహారం మాత్రమే అందిస్తామని తెలిపింది. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. 'గత రెండు వారాల నుంచే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించడం లేదు' అని సంబంధిత అధికారి చెప్పారు.
కాగా ఎయిరిండియాకు రూ. 52వేల కోట్ల వరకు అప్పులున్నాయి. దీంతో సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ప్రైవేటీకరణ బారినుంచి ఎయిరిండియాను కాపాడుకునేందుకు ఉద్యోగులు ఖర్చు తగ్గింపు ప్రణాళికలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







